Saturday, December 21, 2024

కామారెడ్డికి స్వాగత తోరణం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: కామారెడ్డికి వచ్చేవారికి ఘనంగా స్వాగతం పలికేలా స్వాగత తోరణం ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లా స్వాగత తోరణం, ఆరు లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ యార్డ్ సముదాయాలు, తాడ్వాయిలో మినీ స్టేడియం నిర్మాణ పనులు, ఎల్లారెడ్డిలో హైలెవల్ వంతెన, నూతన బస్టాండ్ నిర్మాణ పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. రూ.28కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఆరు వరసల రహదారిగా మార్పు చేశామని వెల్లడించారు. కామారెడ్డి పట్టణాభివృద్ధికి సిఎం కెసిఆర్ రూ.25 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు మరో రూ.20 కోట్లు మంజూరు చేశామని, ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంగా మార్చామని, కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ వచ్చిందని కెటిఆర్ ప్రశంసించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ ఆధ్వర్యంలో కామారెడ్డి అభివృద్ధిలో దూసుకెళ్తోందని కొనియాడారు.

Also Read: శేఖర్ కమ్ముల మూవీలో ఛాన్స్.. ఆనందంలో రష్మిక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News