Saturday, January 11, 2025

అప్పుడు 40 వేల ఎకరాలు… ఇప్పుడు 98 వేల ఎకరాలకు సాగునీరు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: తెలంగాణ ఏర్పడక ముందు దేవరకద్ర లో 40 వేల ఎకరాలకు సాగు అయ్యేదని, ఇప్పుడు 98 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ముసాపేట మండలం వేముల గ్రామంలో 500 కోట్లతో ఎస్ జి డి ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. చెక్ డ్యామ్ లతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని, దేవరకద్రలో అద్భుతమైన చెక్ డ్యామ్ ల నిర్మాణం జరిగిందని ప్రశంసించారు.

Also Read: పెళ్లైన రెండు రోజులకే జవాన్ మర్మాంగాలపై పొడిచిన ప్రియురాలు 

కరివేన పూర్తి అయితే 1.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రిలను కట్టిస్తామని, కరెంట్, తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని,  మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని ప్రతిపక్షాలపై కెటిఆర్ మండిపడ్డారు. లైఫ్ సైన్సు రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరలు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News