Wednesday, January 22, 2025

ఆయిల్ ఫామ్ తో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నిర్మల్: గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్ల కోసం రైతులు తన్నుకునే వారని,  తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా పాక్ పట్లలో ఆయిల్ ఫామ్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ పంటలు కొనుగోలు చేసినా చేయకపోయినా టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తుందని ప్రశంసించారు. ఆయిల్ ఫామ్ పరిశ్రమతో ప్రతి ఒక్కరికి మంచి నూనే అందే అవకాశం ఉందని, తన నియోజకవర్గమైన సిరిసిల్ల రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే తనదే బాధ్యత అని స్పష్టం చేశారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో పండించే ఆయిల్ ఫామ్ పంటను ఇక్కడే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: బ్రిడ్జి పైనుంచి కిందపడిన బస్సు: 21 మంది మృతి

ప్రతి రైతు సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ సాగు అద్భుతంగా ఉంటుందని, రివర్స్ పంపుతో ఎస్సా ఎస్పి ప్రాజెక్టు నిండుకుండలా మారిందని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కెటిఆర్ కోరారు.  కాంగ్రెస్ వాళ్ళకీ ఒక్కసారి కాదు 11 సార్లు 55 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినా ఎం చేశారని, కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు నీరు అందలేదని, కెసిఆర్ పాలనలో ఒక్క సంవత్సరం కరువు కాటకాలు లేవని కెటిఆర్ ప్రశంసించారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉందని, రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్మించామని, నిర్మల్ జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27న ప్రారంభించామని, త్వరలోనే చనాఖా కొరాట, సదర్మాట్ పూర్తి అవుతాయని, అభివృధ్ది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలన్నారు.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News