Thursday, December 26, 2024

వనపర్తి జిల్లాలో కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

వనపర్తి: నేడు మంత్రి కెటిఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. కెటిఆర్‌తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ పాల్గొననున్నారు. సంకిరెడ్డిపల్లిలో ఆయిల్ పామ్ పరిశ్రమ, వనపర్తి బైపాస్, వనపర్తి-పెబ్బేరు బిటి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పెద్దమండి మండలం బుగ్గపల్లితండా వద్ద మిషన్ భగీరథ కేంద్రం, రాజపేట వద్ద రెండు పడక గదుల ఇళ్లు, నాగవరంలో ప్రొ.జయశంకర్ రాక్ గార్డెన్, సురవరం సాహితీ కళాభవనం, అధునాతన సమీకృత మార్కెట్, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, ఐటి హబ్, షాదీఖానా, మట్టి పరీక్షా కేంద్రం, జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో కెటిఆర్ పాల్గొననున్నారు.

Also Read: నాలాలో కొట్టుకుపోయిన మహిళా స్వీపర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News