Sunday, January 19, 2025

వరంగల్ లో మూడు కంపెనీలతో 33 వేల ఉద్యోగాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి చొరవ వల్లే వరంగల్ కు కాకతీయ టెక్స్‌టైల్స పార్కు వచ్చిందని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. 261 ఎకరాల్లో రూ.900 కోట్లతో టెక్స్‌టైల్స్ పార్కు నిర్మాణం జరుగుతోందన్నారు. వరంగల్ లో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. టెక్స్‌టైల్స్ పార్కును యంగ్ వన్ కంపెనీ ఏర్పాటు చేస్తుందన్నారు. వరంగల్‌కు మళ్లీ పూర్వ వైభవం తెస్తామన్నారు. పట్టుపట్టీ మరి ఇక్కడ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. యంగ్ వన్ కంపెనీలో మొత్తం 11 పరిశ్రమలు వస్తాయని, యంగ్ వన్ కంపెనీతో వేల ఉద్యోగాలు వస్తాయని వివరించారు.

ఇక్కడ నిర్మించే పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని చెప్పారు. మేడ్ ఇన్ వరంగల్ దుస్తులు అనేక విదేశాలకు వెళ్తాయని, యంగ్ వన్ కంపెనీ కొరియాలో పెద్ద పరిశ్రమ అని చెప్పారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలన్నారు. మనదేశంలో వ్యవసాయ, టెక్స్‌టైల్స్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, టెక్స్‌టైల్ రంగంలో మనకంటే బంగ్లాదేశ్, శ్రీలంకలు ముందున్నాయని కెటిఆర్ గుర్తు చేశారు. టెక్స్‌టైల్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకరావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్, పంచాయతీ అవార్డులు 30 శాతం తెలంగాణకే వచ్చాయన్నారు. వరంగల్ జిల్లాలో రానున్న మూడు కంపెనీల వల్ల 33 వేల ఉద్యోగాలు వస్తాయని కెటిఆర్ వివరించారు. వరంగల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకవస్తామన్నారు. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీ చేయాలంటే భయపడుతున్నారని, నియోజకవర్గాలు మార్చుకుని మరీ వేరే చోటుకు కాంగ్రెస్, బిజెపి నేతలు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News