Monday, December 23, 2024

వరంగల్, హనుమకొండలో కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

వరంగల్: శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. రూ.900 కోట్ల విలువైన పనులకు కెటిఆర్ శ్రీకారం చుట్టనున్నారు. హనుమకొండలో ఐటి టవర్స్, మడికొండలో ఐటి పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
కాజీపేటలో మురుగునీటి శుద్ధీకరణ కేంద్రానికి కెటిఆర్ భూమిపూజ చేయనున్నారు. హనుమకొండలోని కుడా మైదానంలో బహిరంగ సభలో కెటిఆర్ పాల్గొననున్నారు. వరంగల్‌లో ఎంజిఎం ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్, పోతన నగర్‌లో ఆధునిక దోబీఘాట్‌ను ప్రారంభించనున్నారు. ఖిల్లా వరంగల్ బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ పాల్గొంటారు. కెటిఆర్ పర్యటన దృష్ట్యా ట్రై సిటీలో పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిపి రంగనాథ్ తెలిపారు.

Also Read: 80ఏళ్లు దాటితే ఇంటి నుంచే ఓటు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News