Friday, November 22, 2024

తెలంగాణ భవన్‌కు ఆటోలో కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆటోలో ప్రయాణించి పలువురి దృష్టిని ఆకర్శించారు. కెటిఆర్ ఆటో ప్రయాణం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అ య్యాయి. యూసుఫ్‌గూడ్ నుంచి జూబ్లీహిల్స్‌లో తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని బిఆర్‌ఎస్ నిర్ణయించిన విష యం తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం యూసుఫ్‌గూడ్‌లో జరిగింది. ఆ సమావేశంలో కెటిఆర్ పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశం అనంతరం కారులో కాకుండా ఆటోలో బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది సైతం ఆయనను ఆటోలోనే అనుకరించారు. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆటో డ్రైవర్ కెటిఆర్‌ను కోరారు. ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమకు రీయింబర్స్ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ చెప్పారు. దీనిపై స్పందించిన కెటిఆర్ ప్రభుత్వంపై ఎత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తామని హామినిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటోవాలాల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వారికి పూర్తి మద్ద తు తెలిపారు. కెటిఆర్ వెంట ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఉన్నారు. ప్రస్తుతం కెటిఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ఆటో కార్మికులు మంటిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన సైతం వ్యక్తమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News