హైదరాబాద్: 75 ఏళ్లుగా స్వతంత్ర భారతావని సగర్వంగా ఎగురవేస్తున్న మువ్వన్నెల జెండా రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధులు, తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వారికి ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఘనంగా నివాళులర్పించారు. మంత్రి కెటిఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పింగళి 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ జెండాగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. మహాత్మ గాంధీ సూచనల మేరకు మధ్యంలో రాట్నం గుర్తును తీసుకవచ్చారు. అనంతరం నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో ఆశోక చక్రాన్ని తీసుకవచ్చారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించడంతో పాటు గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.