Monday, December 23, 2024

‘నాడు ఎగతాళి చేశారు.. నేడు కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ నంబర్ వన్’: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR tweet on CM KCR's audacious statement about Telangana

హైదరాబాద్: 2001లో కరీనంగర్ లో జరిగిన సింహగర్జన సభలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని తెరాస పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనపై రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారని.. కానీ, నేడు సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్వీటర్ లో పేర్కొన్నారు. నిన్న జనగాం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘మోడీ జాగ్రత్త.. ఢీల్లీ కోట గోడలు బద్ధలు కొడుతాం’ అని సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ‘మొదట వాళ్లు నిన్ను పట్టించుకోరు. తర్వాత వాళ్లు నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత వాళ్లు నీతో గొడవ పడుతారు. చివరకు విజయం నీదే’ అన్న జాతీపిత మహాత్మ గాంధీ మాటలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.

KTR tweet on CM KCR’s audacious statement about Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News