- Advertisement -
కాంగ్రెస్‌ది నయవంచన.. పచ్చి మోసం, దగా అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ట్విట్టర్(ఎక్స్) ద్వారా ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి.. ‘బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపొయి కట్టొద్దు. డిసెంబ ర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి.
తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోను ఇస్తరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కార్ మౌనం వహిస్తోందన్నారు. రైతన్నలకు లీగల్ నోటీసులు పంపుతోందని ఆరోపించారు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన అని మాజీ మంత్రి కెటిఆర్ మరోమారు పునరుద్ఘాటించారు.
- Advertisement -