Monday, December 23, 2024

దిగ్విజయంగా కొనసాగుతున్న డిజిటల్ హెల్త్ ప్రాజెక్టు..

- Advertisement -
- Advertisement -

KTR Tweet on Digital Health Profile in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: పౌరులందరి డిజిటల్ హెల్ట్ ప్రొఫైల్‌ను రూపొందించే తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ దిగ్విజయంగా కొనసాగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడంలో తెలంగాణ మళ్లీ టార్చ్ బేరర్ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘పౌరులందరి డిజిట్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే పైలట్ ప్రాజెక్ట్ మార్చి 5న ములుగు, సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించబడింది. ఇది దిగ్విజయంగా కొనసాగుతోంది. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడంలో తెలంగాణ మళ్లీ టార్చ్ బేరర్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను’ అని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. పౌరుల ఆరోగ్య వివరాలను నమోదు చేయడానికి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు తనిఖీలు నిర్వహిస్తున్న కొన్ని చిత్రాలను కూడా మంత్రి పోస్ట్ చేశారు. ములుగు, సిరిసిల్ల జిల్లాలలో భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌గా ప్రశంసించబడుతున్న దీనిని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టి.హరీష్‌రావు మార్చి 5న ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పౌరులందరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే పైలట్ ప్రాజెక్ట్.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ అమలు కోసం ఎస్టోనియాలో చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రక్రియను ఆరోగ్య అధికారులు అధ్యయనం చేశారు. తెలంగాణలోని రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద 40 రోజుల్లోగా మొత్తం 197 వైద్య బృందాలను రోల్ అవుట్ చేసేందుకు టాస్క్‌లు తీసుకున్నారు. ఆశావర్కర్లు రోజు ఇళ్ల నుంచి నమూనాలు సేకరించడంలో వైద్య బృందాలకు సహకరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి కనీసం 30 వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాని తర్వాత అతను/ఆమె భవిష్యత్ వైద్య చికిత్సల కోసం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్‌ని అందుకుంటారు. ఈ బృందాలు రక్తపోటు, చక్కెర, మూత్రం, ఇతర రక్తపరీక్షల వంటి వివరాలను సేకరిస్తాయి. నిర్ధిష్ట సందర్భాలలో అదనపు వివరాలు అవసరమైతే, అటువంటి వ్యక్తులు తదుపరి పరీక్షల కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌కు తీసుకెళ్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతి పౌరుడి ఆరోగ్య ఐడిని సృషించి, సంబంధిత డేటాను అప్‌లోడ్ చేస్తారు. ఏదైనా ప్రమాదం లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తులకు తక్షణ ఆరోగ్య సంరక్షణ అందించడంలో ఇది సహాయపడుతుంది. ఒక వ్యక్తి ఆసుపత్రులను సందర్శించినప్పుడు లేదా ఎవరైనా ప్రమాదాలకు గురైనప్పుడు వైద్య సహాయం అవసరమైనప్పుడు డేటా క్లౌడ్‌లో డిజిటల్ రూపంలో నిల్వ చేయబడుతుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఆరోగ్య వ్యాధి లేదా సంక్లిష్టత ఎక్కువగా నివేదించబడుతుందో లేదా తెలుసుకోవడానికి కూడా డేటా సహాయం చేస్తుంది. తద్వారా నిర్ధిష్ట ప్రాంతం కోసం ప్రోగ్రామ్‌లను రూపొందించడానికి, అమలు చేయడానికి అధికారులను అనుమతిస్తుంది.

KTR Tweet on Digital Health Profile in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News