Saturday, December 21, 2024

“మూడు పంటలు” కావాలా… “మూడు గంటలు” కావాలా… “మతం పేరిట మంటలు” కావాలా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులను ముంచే కాంగ్రెస్ కావాలా?… రైతులను రాజులను చేసే సిఎం కెసిఆర్ కావాలా? అని మున్సిపల్, ఐటి మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ నోట..
రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !!

కాంగ్రెస్ వస్తే…
నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు..

నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు

మూడు ఎకరాల రైతుకు..
మూడు పూటలా కరెంట్ ఎందుకు అనడం..
ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే

కాంగ్రెస్ కు ఎప్పుడూ..
చిన్నకారు రైతు అంటే చిన్నచూపు
సన్నకారు రైతు అంటే సవతి ప్రేమ

నోట్లు తప్ప… రైతుల పాట్లు
తెల్వని రాబందును నమ్మితే
రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం..
అన్నదాత నిండా మునుగుడు పక్కా..

నాడు..
ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్

నేడు..
ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోంది

మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే
బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి…

అరికాలిలో మెదడు ఉన్నోళ్లను
నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం…

మళ్లోసారి రాబందు 3 గంటల మాటెత్తితే..
రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం..

తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం..!!

రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కావాలా ?
3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ??

సిఎం కెసిఆర్ నినాదం…
” మూడు పంటలు ”

కాంగ్రెస్ విధానం…
” మూడు గంటలు ”

బిజెపి విధానం
“మతం పేరిట మంటలు”

“మూడు పంటలు” కావాలా..
“మూడు గంటలు” కావాలా..
“మతం పేరిట మంటలు” కావాలా…

తెలంగాణ రైతు…
తేల్చుకోవాల్సిన..
తరుణమిది..!!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News