Monday, December 23, 2024

మోడీ స్ట్రోక్.. పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత…

- Advertisement -
- Advertisement -

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించిందని, అయినా ఇంకా ధరలు సామాన్యుడికి భారంగానే ఉన్నాయంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ముందు అసలు ధరలు పెంచింది ఎవరు? ఇప్పుడు తగ్గింపు పేరుతో ప్రజలను మోసం చేస్తుంది ఎవరూ? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ‘నా పాఠశాల పక్కన ఉన్న ఓ దుకాణాదారుడు పీక్ సీజన్‌లో ధరలను 300శాతం పెంచి, ఆపై ప్రజలను మోసం చేయడానికి దానిని 30శాతం తగ్గించే వాడు. అతని సన్నిహితులు దాన్ని బంఫర్ ఆఫర్‌గా అభివర్ణిస్తూ, అతనికి ధన్యవావాలు తెలిపేవారు. ఇది ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా? ముందు అసలు ధరలు పెంచింది ఎవరు..?’ అని ట్వీట్ చేశారు.

దీనికి నెటిజన్లు ఇలాంటి పని చేసేది ఇంకెవరూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటూ సమాధానమిచ్చారు. ‘ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 2014లో రూ.3.57, 2022 నాటికి రూ.27.90 అంటే పెంచింది రూ.18.42.. ఇప్పుడు తగ్గించింది రూ.8, డీజిల్‌పై 2014లో 3.57, 2022 నాటికి అది రూ.21.80 అంటే పెంచింది రూ.18.23, ఇప్పుడు తగ్గించింది రూ.6’ ‘పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత’ తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో వ్యాట్‌ను ఒక్కపైసా పెంచలేదు.’ ‘మోడీ ఫిల్లింగ్ స్టేషన్.. పెట్రోల్, డీజిల్‌పై సెస్- ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచారు. యూపీ ఎన్నికల తరువాత ఎవరూ ఊహించనంత ధరలు పెంచారు. కానీ, ఇప్పుడు దాన్ని స్వల్పంగా తగ్గించారు. దీన్నే మోడీ స్ట్రోక్’ అంటారు అంటూ ట్వీట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News