Wednesday, January 22, 2025

మోడీ…. రైతుల ఆదాయం రెట్టింపు ఏది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

We want CCI reopened

హైదరాబాద్: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ ప్రభుత్వం హామీ ఏమైందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సందర్భంగా ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.  2022 నాటికి ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తానని, ప్రతి ఇంటికి నీరు, విద్యుత్, టాయిలెట్ సదుపాయం కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ చెప్పినవిధంగా మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవెర్చాలని కోరారు. రాష్ట్రాల హామీలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు సమాన కేటాయింపులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవికతను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News