మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్డీఏ నుంచి జెడియూ నిష్క్రమించిన తర్వాత ఎంతమంది కూటమి భాగస్వాములు మిగిలారంటూ రాష్ట్ర పురపాలక, ఐటిశాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. సిబిఐ, ఐటి, ఇడి కాకుండా ఎంతమంది అంటూ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇస్తున్న బిజెపి నాయకత్వానికి బిహార్ సీఎం, జేడీ(యు) నేత నీతీశ్‌కుమార్ ఝలక్ ఇచ్చారు. మరోసారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ)తో అయిదేళ్లుగా పెనవేసుకున్న బంధాన్ని తెంచుకున్నారు. తదుపరి కొన్ని నిమిషాల్లోనే మహా కూటమితో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ప్రత్యర్థి పార్టీలను మిత్రులుగా మార్చుకున్నారు. ఆర్‌జెడి నేతృత్వంలోని ఆ కూటమి ప్రభుత్వానికి సారథిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 8వ సారి బుధవారం మధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు.
KTR Tweet on JDU Quits from NDA