- Advertisement -
హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయ్యాలి అనే దానిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. 2014 నుంచి 2024 వరకు కూడా పార్లమెంట్‌లో తెలంగాణ హక్కుల కోసం ప్రశ్నించింది బిఆర్‌ఎస్ మాత్రమేనని ఆయన తెలిపారు. 16వ, 17వ లోక్‌సభలో తెలంగాణ ఎంపిలు 6215 సార్లు సమస్యలపై మాట్లాడగా బిఆర్‌ఎస్ ఎంపిలు 4754 సార్లు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపిలు 1271 సార్లు, బిజెపి ఎంపిలు 190 సార్లు ప్రశ్నించారని వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉన్న ఏకైక గొంతుక బిఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నాడు… నేడు… ఏనాడైనా తెలంగాణ గళం… తెలంగాణ బలం… తెలంగాణ దళం… బిఆర్ఎసేనని కెటిఆర్ తన ట్వీట్‌లో వివరించారు.
- Advertisement -