Friday, November 22, 2024

విశ్వగురును మాత్రం పొగడాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR tweet on PM Modi

హైదరాబాద్: రూపాయి విలువ అతి తక్కువకు పడిపోయిందని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలు సందించారు.  కేంద్ర మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని మంత్రి మోడీ ఫోటో కోసం వెతుకుతున్నారని, రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని కేంద్ర మంత్రి అంటున్నారని, గాడ్ ఆఫ్ యాక్ట్స్ వల్లే అన్ని ఆర్థిక అవరోధాలు అంటున్నారని విమర్శించారు. గాడ్ ఆఫ్ యాక్ట్స్ వల్లే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని కేంద్ర మంత్రులు అంటున్నారని కెటిఆర్ చురకలంటించారు.. విశ్వగురును మాత్రం పొగడాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకుపై కెటిఆర్ స్పందించారు. తెలంగాణకు టాప్ ర్యాంక్ రావడం గర్వంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, పంచాయతీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. రైతు బీమా పథకంపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం మనదన్నారు. ఈ ఏడాది 34 లక్షల మంది రైతులకు రూ.1450 కోట్లు పంపిణీ చేశామని, 85 లక్షల మంది రైతులకు ఐదు లక్షల రూపాయల చొప్పున పంపిణీ చేశామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News