Sunday, February 2, 2025

ఆ పరిశ్రమతో పోటీ పడే అవకాశం సిరిసిల్లకు ఉంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. పవర్ లూమ్ పరిశ్రమపై కెటిఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తమిళనాడులోని తిరుపూర్ పరిశ్రమకు సమానంగా పోటీ పడే అవకాశాలు సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు ఉందన్నారు. పవర్‌లూమ్ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే సిరిసిల్ల పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్తుందని ముందస్తుగా చెప్పారు. పవర్ లూమ్ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. గత పది సంవత్సరాల నుంచి పవర్ లూమ్ పరిశ్రమను ఎంతో అభివృద్ధి చేయడంతో నేతన్నల జీవితాలు మెరుగుపడ్డాయన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన సహకారంతో నేతల జీవితాల్లో వెలుగులు వచ్చాయని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News