Wednesday, January 22, 2025

కెసిఆర్ కల సాకారమైంది

- Advertisement -
- Advertisement -

మరో స్వప్నం సాకారమైన క్షణమిది, కెసిఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజు ఇది అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వెనుకాల గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి ఎంతో ఉంద న్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. మొత్తానికి ఆ ప్రాజెక్టు ట్రయల్ రన్ ను గురువారం నిర్వహించగా విజయవంతమైందన్నారు. సీతారామ ప్రాజెక్టు తన గుండెకాయ అని కెసిఆర్ గతంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కరువును శాశ్వ్తంగా పాదరోలే వరప్రదాయినికి కెసిఆర్ జీవం పోశారని కొనియాడారు.

సీతారామ ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించి, పటిష్ట ప్రణాళికను తయారు చేసియుద్ధ ప్రాతిపదికన అమలు చేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఇక ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదు.. దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదు అని పేర్కొన్నారు. కాలమైనా.. కాకపోయినా.. ప్రవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో.. ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు రానున్నాయని పేర్కొన్నారు. కెసిఆర్ కలను సాకారం చేసి.. ఈ ‘జలవిజయం’లో భాగ స్వాములైన నీటిపారుదల అధికారులు, సిబ్బందికి అభినందనలు, కష్టపడిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. జై తెలంగాణ.. జై సీతారామ ప్రాజెక్టు అంటూ కెటిఆర్ తన ట్వీట్‌ను ముగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News