Friday, December 20, 2024

దిగొచ్చిన కేంద్రం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డిసెంబర్ 9వ తేదీన మరోసారి కెటిఆర్ గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రం సాధన కోసం సిఎం కెసిఆర్ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ప్రకటించింది. ఉద్యమ నేత కెసిఆర్ సంకల్పం కారణంగానే రాష్ట్ర ప్రకటన చేశారని ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పి 60 ఏండ్ల ఆకాంక్షలకు సరికొత్త ఉపిరినిచ్చిన చారిత్రాత్మక మైలు రాయి అని కెటిఆర్ పేర్కొన్నారు.

‘స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యమ నేత కెసిఆర్ గారి ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసిన రోజు. తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపుతిప్పి 60 యేళ్ల ఆకాంక్షలకు సరికొత్త ఊపిరినిచ్చిన చారిత్రాత్మక మైలురాయి’ అని కెటిఆర్ అభివర్ణించారు. ఆనాటి కెసిఆర్ దీక్షకు సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్‌లో జత చేశారు.
ఆ చారిత్రక సంకల్పానికి 13 ఏండ్లు : మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏండ్లని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో అంటూ తన ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజుల ఆమరణ దీక్ష చేపట్టిన కెసిఆర్ ఉద్యమ సంకల్పానికి కేంద్రం దిగొచ్చి తెలంగాణను ప్రకటించిందని ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. దీక్ష సందర్భంగా కెసిఆర్ ఖమ్మం హాస్పిటల్, నిమ్స్ దవాఖానాలో ఉన్నప్పటి ఫోటోలను షేర్ చేశారు.

‘తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో.. అంటూ ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజుల ఆమరణ దీక్ష చేపట్టిన ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగొచ్చిన రోజు. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన ఆ చార్రితక సందర్భానికి నేటితో 13 ఏళ్ళు’ అని మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News