- Advertisement -
కుదరదంటూ మంత్రి సబిత రిప్లై
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టెట్ పరీక్ష వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వకుండానే ఎగ్జామ్ తేదీ ముందుగానే ఖరారు చేశామని ఆమె మంత్రి కెటిఆర్‌కు తెలిపారు. జూన్ 12వ తేదీన రైల్వే పరీక్ష ఉన్నందున టెట్ పరీక్షను వాయిదా వేయాలంటూ ఓ అభ్యర్థి కెటిఆర్‌కు చేసిన ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ మంత్రి సబితకు మంత్రి కెటిఆర్ ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ స్పందించిన సబితా ఇంద్రారెడ్డి… అధికారులతో చర్చించానని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నత తర్వాతనే టెట్ షెడ్యూలు ఖరారు చేసినట్లు ట్వీట్ చేశారు. సుమారు మూడున్నర లక్షల మంది టెట్‌కు హాజరు కానున్నారని, టెట్ వాయిదా వేస్తే ఇతర ఏర్పాట్లపై ప్రభావం పడుతుందని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
- Advertisement -