Thursday, December 19, 2024

32 యూట్యూబ్ చానెళ్లు పెడితే సరిపోయేది: కేటీఆర్

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన ఓ రీట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ముగిశాక తనకు ఎన్నో రకాలుగా ఫీడ్ బ్యాక్ అందుతోందనీ, అలా అందిన వాటిలో తనకు బాగా నచ్చినదాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నాననీ చెబుతూ ఒక అభిమానినుంచి వచ్చిన పోస్టును రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏముందంటే… కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 32 మెడికల్ కాలేజీలు పెట్టారని, నిజానికి వాటి బదులు ఫేక్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు 32 యూట్యూబ్ చానెళ్లను పెడితే సరిపోయేదని ఒక నెటిజన్ పోస్ట్ చేస్తూ, నా అభిప్రాయంతో ఏకీభవిస్తారా? అని ప్రశ్నించాడు. దాన్నే కేటీఆర్ రీట్వీట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. మెడికల్ కాలేజీలు పెట్టడంతోపాటు యూట్యూబ్ చానెళ్లను కూడా పెడితే బాగుండేదని ఒకరు  అభిప్రాయపడగా, సోషల్ మీడియా ద్వారా గ్రామాల్లో ఫేక్ ప్రచారం జరిపారని మరొకరు వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News