Monday, December 23, 2024

‘మీరు అత్యంత నీచమైన వ్యక్తిని ఎంచుకున్నారు’: రాహుల్‌గాంధీకి కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

KTR Tweet Rahul Gandhi on Revanth Reddy's Comments

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కెటిఆర్ ట్వీట్ చేశారు. రాహుల్‌గాంధీపై అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ అనైతికంగా మాట్లాడితే.. తమ నాయకుడు కెసిఆర్ ఖండిచారని చెప్పారు. ‘రాజకీయాలకు అతీతంగా రాజనీతిజ్ఞుడిగా రాజీవ్‌గాంధీ గౌరవాన్ని సిఎం కెసిఆర్ కాపాడారు. మీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.. కెసిఆర్ మరణాన్ని కోరుకుంటున్నారు. రాహుల్‌జీ మీరు అత్యంత నీచమైన వ్యక్తిని ఎంచుకున్నారు. అతను త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నాను’ అని కెటిఆర్ ట్వీట్ చేశారు.

KTR Tweet Rahul Gandhi on Revanth Reddy’s Comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News