Wednesday, January 22, 2025

రైల్వే మంత్రి అశ్విన్ కు కెటిఆర్ ట్వీట్…

- Advertisement -
- Advertisement -

KTR tweet to railway minister Aswini

హైదరాబాద్: వయోవృద్ధులకు రైలు టికెట్ రాయితీ రద్దుపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఓ వార్తా సంస్థ రాసిన న్యూస్ క్లిప్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్వీట్టర్ లో ట్యాగ్ చేశారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యతే కాదని, విధి కూడా అని అన్నారు. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఎత్తివేయాలన్ని నిర్ణయం బాధాకరమన్నారు. రాయితీ ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలని కేంద్రానికి కెటిఆర్ సూచించారు.  కరోనా పేరు చెప్పి రైలు టికెట్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీని మోడీ ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. రైళ్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ప్రసక్తే లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్ తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News