Tuesday, December 24, 2024

హిమాన్షు ‘గోల్డెన్ అవర్’ సాంగ్‌కు కెటిఆర్ ఫిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కెటిఆర్ తనయుడు హిమాన్షు రావు అద్భుతంగా ఆలపించిన ‘గోల్డెన్ అవర్’ సాంగ్ కు ఫిదా అయినట్లు కెటిఆర్ పేర్కొన్నారు. ఈ సాంగ్‌పై నెటిజన్‌ల నుంచి కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. హిమాన్షు తండ్రి, మంత్రి కెటిఆర్ కూడా పాటకు ఫిదా అయ్యారు. ‘సూపర్ ప్రౌడ్ అండ్ ఎగ్జయిటెడ్ ఫర్ మై సన్’ అంటూ మంత్రి తన ట్విటర్ ఖాతాలో రీట్వీట్ చేశారు. ‘I loved it; Hope you all do too’ అంటూ మెచ్చుకున్నారు.

అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ (జెవికెఇ) పాడిన ‘గోల్డెన్ అవర్’ సాంగ్‌ను తెలంగాణ మంత్రి కెటిఆర్ తనయుడు హిమాన్షు రావు అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను హిమాన్షురావు ‘గోల్డెన్ అవర్ X హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్‌లో షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News