Wednesday, January 22, 2025

ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి, బ్యాంకులకు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా బిజెపిపై సె టైర్లు వేశారు. పంచాంగశ్రవణానికి పేరడి అన్నట్లుగా వ్యంగ్యాస్త్రా లు సంధించారు. ‘ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి, బ్యాంకులకు. అవమానం నెహ్రూకి.. రాజపూజ్యం గుజరాతీ గుంపుకి. బస్, బభ్రాజీమానం భజగోవిందం. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం’ అంటూ మంత్రి కెటిఆర్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం కెటిఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మోడీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదని తెలిసినా బిఆర్‌ఎస్ నేతలెవరూ వెనక్కి తగ్గడం లేదు. పైగా, మోడీ, అమిత్‌షా ద్వయంతో తాడోపేడో తేల్చుకునేందుకు కేసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్, బిజెపి మధ్య వార్ మరింత హీటెక్కే పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News