Thursday, January 23, 2025

దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్ ఎగరేస్తోంది…

- Advertisement -
- Advertisement -
మంత్రి కెటిఆర్ ట్వీట్

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంబగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పంచాయతీలకు ప్రతి నెల నిధులు మంజూరు చేయడం, అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్ ఎగరేస్తోందని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా పంచాయతీలకు కేంద్రం ప్రకటిస్తున్న అవార్డుల్లో మన తెలంగాణ పల్లెలు అగ్రభాగాన నిలుస్తున్నాయి.

ఇప్పటికే అనేక అవార్డులను తెలంగాణ గ్రామాలు అందుకుని, ఇతర రాష్ట్రాల్లోని పల్లెలకు ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. పల్లె ప్రగతి దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. జాతిపిత మహాత్ముడు కన్నకలల్ని సిఎం కెసిఆర్ సాకారం చేశారని తెలిపారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మాగాంధీ ఆశయమే స్ఫూర్తిగా సిఎం గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు. పల్లె ప్రగతికి ప్రాణం పోశారని కొనియాడారు. నాడు.. దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లె..నేడు దర్జాగా కాలర్ ఎగరేస్తోంది అని అభిప్రాయపడ్డారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ఊరు.. ఇవాళ సకల సౌకర్యా లతో వెలిగిపోతోందని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ సంకల్పంతో ప్రతి పల్లె సీమ, ప్రగతి సీమగా మారిందని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News