Thursday, January 23, 2025

కర్నాటక రైతులను కాంగ్రెసోళ్లు అరిగోస పెడుతున్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ విమర్శలపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ఇంటింటికి తాగునీరు, 24 గంటల విద్యుత్ కాంగ్రెసోళ్లు ఆపేయమంటారేమే అని చురకలంటించారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని కెటిఆర్ విమర్శించారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కాంగ్రెస్ కుట్రను రైతులు సహించరని, రైతుబంధు ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కత్తిరించాలని ధ్వజమెత్తారు. నమ్మి ఓటేస్తే కర్నాటక రైతులను కాంగ్రెసోళ్లు అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్నారని, కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News