Thursday, December 26, 2024

కెటిఆర్ రెండు వారాల యుకె, యూఎస్ పర్యటన సక్సెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : యుకె, యుఎస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కె.టి.రామారావు ఈ నెలాఖరున హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం ఈ నెల 16న విదేశాలకు వెళ్లిన కెటిఆర్.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించి 42 వేల ఉద్యోగాల కల్పనకు కృషి చేశారు. ఇంతకు మూడు రెట్లు పరోక్షంగా ఉపాధి లభించేలా పాటుపడ్డారు. మంత్రి కెటిఆర్ తన రెండు వారాల పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. ఈ సందర్భంగా 80కి పైగా బిజినెస్ సమావేశాలు, వివిధ అంశాలపై నిర్వహించిన ఐదు రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News