Monday, December 23, 2024

వైరస్‌ల వైరి ‘ఇన్‌స్టాషీల్డ్’

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహచారి రూపొందించిన పరికారాన్ని ఆవిష్కరించి, మెచుచకున్న మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : అన్ని రకాల వైరస్‌ను సంహరించే అధునాత మైన పరికరాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ప్రస్తుత వైరస్‌నే కాకుండా భవిష్యత్తులో వచ్చే అన్ని రకాల వైరస్‌లను సమర్థవం తంగా నియంత్రించేందుకు ఇన్‌స్టా షీల్డ్ పరికరం చాలా అద్భుతంగా పనిచేస్తుం ద న్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట కు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి ఈ పరికరాన్ని రూపొం దించారు. దీనిని శనివారం మంత్రి కెటి ఆర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరికరం విధానాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం కెటిఆర్ మాట్లాడు-తు, వైరస్ కిల్లర్ పరికరం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ పరికరం అందరికి ఉపయోగ పడుతుందన్నారు. పరికరం ఉత్పత్తికి, ఏర్పాటుకోసం ప్రభుత్వపరంగా చారికి సం పూర్ణంగా సహకరిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చా రు. ఇన్‌స్టా లాంటి ఆవిష్కరణ లకు మరిం త ఊతం ఇస్తామన్నారు.

గతంలో నర్సింహాచారి ఇంటింటా ఇన్నోవేటర్ పురస్కారానికి ఎంపిక య్యారని, ఇప్పుడు కొత్తగా ఇన్‌స్టా షీల్డ్‌ను రూ పొందించే స్థాయికి చేరడం ఆనందంగా ఉంద ని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు. చారిని ప్రత్యేకంగా అభినందించారు. తరం చారి మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని వైరస్ ల బారినుండి కాపా డాటానికే రెండేండ్లు శ్ర మించి ఇన్‌స్టాషీల్డ్‌ను రూపొందించినట్లు వెల్ల డించారు.ప్రతి ఒక్కరికి దీనిని చేర్చడమే తన జీవితాశయమన్నారు. కరోనా, సార్స్, ఒమి్ర కా న్, డెల్టా తదితర బ్యాక్టీరియా అన్ని రకాల వైరస్‌లను నెగిటీవ్ ఎలెక్ట్రాన్ల సహాయంతో సం హరించే పరికరాన్ని రూపొందించినట్లు పేర్కొ న్నారు. సిసిఎంబి, సిడిఎస్‌సిఒ, వింటా, ఎంటా క్ ల్యాబ్ తదితర సంస్థలు కూడా దీనిని ధ్రువీక రించాయన్నారు. ఇన్‌స్టాషీల్డ్ మెడికల్ డివైస్ పేరిట విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా చారి తెలిపారు. కరోనా మూలాలను తెలుసు కొని ఈ పరికరం పని చేస్తోంది. అత్యల్ప సమయంలోనే ఇది అన్ని రకాల వైరస్ లను సంహరిస్తుంది.దీనివల్ల దుష్పరిణామాలు ఉండ వ ని సిసిఎంబి కూడా తేల్చింది.

KTR Unveils Insta Shield device kills all Viruses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News