Friday, November 15, 2024

KTR: సిబిఐ అంటే మోడీకే నమ్మకం లేదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్, బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరస్పర రాజకీయ విమర్శలు ఇటీవల పెరిగిపోయాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి విచారణకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను పిలవడంతో బిజెపికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో హోర్డింగ్స్, పోస్టర్లు కనిపించగా ఎంఎల్‌సి కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ ప్రశ్నిస్తూ, విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుని కెటిఆర్ విమర్శలు చేశారు.

10 ఏళ్ల కిందట కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గుజరాత్ సిఎంగా నరేంద్ర మోడీ చేసిన ట్వీట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా సిబిఐ మారిపోయింది. ఆ సంస్థపై దేశం విశ్వాసం కోల్పోయింది. సిబిఐతో భయపెట్టాలని చూడొద్దని కేంద్రానికి స్పష్టం చేస్తున్నా’ అని ట్వీట్‌లో మోడీ పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘సిబిఐ లాంటి కేంద్ర సంస్థలపై దేశానికి ఎందుకు నమ్మకం లేదు? ఎందుకంటే గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారే సిబిఐని నమ్మరు కాబట్టి!’ అని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News