Monday, December 23, 2024

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దివంగత ఎంఎల్‌ఎ లాస్య నందిత కుటుంబ సభ్యులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పరామర్శించారు. ఆదివారం ఉదయం కెటిఆర్ మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లి నందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. లాస్య నందిత తల్లి, సోదరిని ఓదార్చారు.

అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్కు గురయ్యానని చెప్పారు. దురదృష్టవశాత్తు తాను విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. లాస్య నందితను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన్న మరణించారని తెలిపారు. నందిత కుటుంబానికి బిఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.

KTR 2

KTR 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News