Monday, December 23, 2024

సీనియర్ పువ్వాడను పరామర్శించిన మంత్రి కేటిఅర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రఘునాథపాలెం: గత రెండు వారాలుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ జాతీయ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వర రావుని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ మంగళవారం పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి కెటిఆర్‌ని చూసి సీనియర్ పువ్వాడ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు అరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి కేటిఆర్‌కి వైద్యులు క్షుణ్ణంగా వివరించారు. మంత్రి కేటిఆర్ వెంట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News