Monday, December 23, 2024

ఫ్లోరైడ్ బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించిన కెటిఆర్…

- Advertisement -
- Advertisement -

మునుగోడు: మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి కెటిఆర్ వెళ్లారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. దీంతోపాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షల రూపాయలు మంజూరు చేయించారు. మిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేయించి పూర్తి చేయించారు. కెటిఆర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ అతడి ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు. మునుగోడు ఉప ఎన్నికలలో కుసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి కెటిఆర్ అకస్మాత్తుగా వచ్చారు. అంశాల స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంశాల స్వామి ఇంట్లో కెటిఆర్ భోజనం చేశారు. అంశాల స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం, ఆయన హెయిర్ కటింగ్ సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంశాల స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఎర్రబెల్లితో ముచ్చటించిన వృద్ధుడు

కోమటిరెడ్డి… కోవర్టు రెడ్డి కావొద్దు: విహెచ్

ఓటర్లు కెసిఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News