Thursday, December 19, 2024

ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ ః దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదివారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు శశివర్ధన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం దశ దిన కర్మ ఉండడంతో భూత్పూర్ మండలం, అన్నాసాగర్‌కు చేరుకున్న కెటిఆర్ ముందుగా శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి, ధైర్యం చెప్పారు.

శశివర్ధన్ రెడ్డి ౧కాల మరణం ఎంతో బాధించిందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని కెటిఆర్ పరామర్శించడానికి రావడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంఎల్‌ఎలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News