Wednesday, November 6, 2024

ఈ నెల 29న వనపర్తికి కెటిఆర్ రాక

- Advertisement -
- Advertisement -

వనపర్తి : ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఈ నెల 29న వనపర్తికి రానున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కెటిఆర్ పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వననర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం, గంజ్‌లో టౌన్ హాల్, సమీకృత మార్కెట్, మెడికల్ కళాశాల ప్రాంతాలను పరిశీలించి అధికారులకు కెటిఆర్ పర్యటన బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రూ.425 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రూ.73 కోట్ల బైపాస్ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రూ.5.08 కోట్లతో రాజాపేటలో నిర్మించిన 96 డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులకు అందజేస్తారని అన్నారు. రూ. 75లక్షలతో నిర్మించిన ఆచార్య జయశంకర్ పార్క్, కాంస్య విగ్రహం ఆవిష్కరణ, రూ.2.80 కోట్లతో నిర్మించిన షాదీఖానా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రూ.2.75 కోట్లతో నిర్మించే బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన , నాగవరం వద్ద రూ. 1.02 కోట్లతో నిర్మించిన భూసార పరీక్షల కేంద్రం, రూ.50 లక్షలతో నిర్మించిన యానిమల్ కేర్ యూనిట్, రూ.కోటితో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ ప్రారంభం చేస్తారని అన్నారు. రూ. 22 కోట్లతో నిర్మించే వనపర్తి కెడిఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని, విద్యార్థుల వసతి గృహాలకు శంకుస్థాపన, రాజభవనం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.15కోట్లతో నిర్మించే అంతర్గత రహదారులు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని వెల్లడించారు. రూ.కోటితో రాజీవ్ చౌక్‌లో నిర్మించిన సురవరం గ్రంథాలయం, గంజ్‌లో రూ.20 కోట్ల సమీకృత మార్కెట్, రూ.5.75 కోట్లతో నిర్మించిన టౌన్ హాల్ ప్రారంభం చేస్తారన్నారు. పీర్లగుట్టలో రూ.15.50 కోట్లతో నిర్మించిన 294 డబుల్ బెడ్ రూం ఇండ్లు రూ.1.25 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభం,

రూ.48.50 కోట్లతో నిర్మించే పెబ్బేరు రహదారి పనులు, రూ.25.52 కోట్లతో నిర్మించే జేఎన్ టీయూ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన, గంజ్‌లో ఐటి టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 29న మొత్తం రూ.666.42 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని కెటిఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సూపరిండెంట్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి, డి.ఈ ఈ నాగేశ్వరరావు , ఏఈ కృష్ణయ్య, కాంట్రాక్టర్, డిఎంఓ స్వరణ్ సింగ్, మార్కెట్ సెక్రటరీ లక్ష్మయ్య, కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News