Sunday, March 30, 2025

కమీషన్ల కలకలం

- Advertisement -
- Advertisement -

కేటీఆర్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో
దుమారం ఒళ్లు దగ్గరపెట్టుకొని
మాట్లాడాలన్న డిప్యూటీ సీఎం భట్టి
కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని
డిమాండ్ కెటిఆర్ వ్యాఖ్యలను
రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్
నిరసనగా బిఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్
అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయింపు

మన తెలంగాణ / హైదరాబాద్ : శాసన స భలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రా ష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో 30శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ప్ర భుత్వంపై కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చే శారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు అ సెంబ్లీలో ఆ విషయంపై బహిరంగంగా చ ర్చించుకుంటున్నారని సభలో ప్రస్తావించా రు. 30 శాతం కమిషన్లు తీసుకుని బిల్లులు చేస్తున్నారని, సచివాలయం వద్ద ఆందోళనలు చేస్తున్నారన్న ఆయన మాటలపై అధికార పక్షం భగ్గుమంది. కేటీఆర్ వ్యాఖ్యల పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీ వ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణ లు చేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, బీ ఆర్‌ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మా ట్లాడాలని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ సభ్యులకు వ్యతిరేకంగా సభలో కాంగ్రెస్ సభ్యు లు నినాదాల చేశారు. తాము 30 శాతం క మీషన్లు తీసుకున్నట్లుగా నిరూపించాలని డి ప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కెటిఆర్‌కు సవాల్ విసిరారు.

బుధవారం సభ ప్రారం భం కాగానే ముందుగా శాసన సభలో బడ్జె ట్ పద్దులపై చర్చలో భాగంగా బిఆర్‌ఎస్ సభ్యుడు పల్లారాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వం పని తక్కువ ప్రచారం ఎక్కువని మాట్లాడారు. దీన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి త ప్పుపట్టారు. ఇలాంటి చవకబారు మాటలు మానుకోవాలని హితవుపలికారు. ఇదే అం శంపై కేటీఆర్ జోక్యం చేసుకుని మంత్రులు ప్రతిసారీ సభ్యుల ప్రసంగాలకు అడ్డు తగలవద్దంటూనే ఈ ప్రభుత్వంలో కమీషన్లు లేకుండా పనులు జరగడం లేదని వ్యాఖ్యానించారు. మంత్రులు అంత ఎగ్జైట్ అయి మాట్లాడితే ఎలా? ప్రతిపక్షానికి ప్రభుత్వా న్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. మీరు నెరవేర్చ ని హామీలు, పథకాలపైనే మాట్లాడుతున్నామని,మంత్రుల లాగే తాము కూడా రెచ్చగొట్టాలంటే ఆ పని చేయవచ్చని కెటిఆర్ అన్నారు.

30 శాతం కమీషన్లు అని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారని, 20 శాతం కమీషన్లని సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సభలో అధికార కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ దశలో కెటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. శాసనసభను, రాష్ట్రాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. 30 శాతం కమిషన్ అంటున్న కేటీఆర్ నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. లేదంటే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ పాపం వల్ల బిల్లులు రాక గుత్తేదారులు ఏడుస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి చెప్పారు. తాము ప్రస్తుతం బిల్లుల చెల్లింపులను సరిచేస్తున్నామని వివరించారు. బిఆర్‌ఎస్ సభ్యులు కేటీఆర్ వ్యాఖ్యలను స్పీకర్ ప్రసాద్ కుమార్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బిఆర్‌ఎస్ సభ్యుల డిమాండ్‌ను తోసిపుచ్చడంతో వాళ్లు సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు.

అడ్డగోలు ఆరోపణలు చేయడం సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కేటీఆర్ గౌరవంగా మాట్లాడుతారని తాను ఊహించానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేటీఆర్ సభనే కాదు రాష్ట్రాన్ని కూడా తప్పుదోవపట్టిస్తున్నారని, అభయహస్తం పేరుతో అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చారని కేటీఆర్ అనడం సరి కాదన్నారు. రూ.4 కోట్లు ఇచ్చి రూ.40 కోట్లు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని పల్లా అన్నారని, తాము ప్రకటనలు ఇచ్చినట్టు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చూశారా? అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో పల్లా సభను తప్పుదోవపట్టించారని, 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కేటీఆర్ అంటున్నారన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో రూ.40 వేల కోట్ల పనులు చేసి బిల్లులు చెల్లించలేదని, కెటీఆర్ తన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. నిరూపించని పక్షంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, మైకు ఉందని అడ్డగోలు ఆరోపణలు చేయడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News