Tuesday, January 21, 2025

కాంగ్రెస్ గతం…. ఆ పార్టీ పని ఖతం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: హైదరాబాద్ తరువాత జగిత్యాలలో అతి పెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. గత పాలకులు జగిత్యాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. సిఎం కెసిఆర్ వల్లే జగిత్యాల జిల్లాగా మారిందని, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని, జగిత్యాలకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ గతం అని, ఆ పార్టీ పని ఖతమని ఎద్దేవా చేశారు. రైతులకు నష్టం లేకుండా జగిత్యాలకు మాస్టర్ ప్లాన్ వేశామని, మామిడి రైతల కోసం పెప్సీ, కోకకోల లాంటి కంపెనీలను జగిత్యాలకు తీసుకొచ్చామన్నారు.

కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు ఎలా ఉన్నాయో తెలుసునని, కాంగ్రెస్ పాలనలో ఐదు నిమిషాల కరెంట్ కోసం బతిమిలాడిన రోజులు ఉన్నాయని, రైతుల కష్టాలు తెలిసిన సిఎం కెసిఆర్‌కు అండగా ఉండాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దకుతుందన్నారు. 60 ఏళ్లు మోసం చేసిన కాంగ్రెస్… ఆరు గ్యారెంటీలతో ముందుకు వస్తుందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌లో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, బిడి కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో 18 రాష్ట్రాల్లో బిడి పరిశ్రమలు ఉన్నాయని, కానీ ఎక్కడా పెన్షన్ లేదన్నారు. ముసలి నక్క కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని, ఆ పార్టీ అధ్యక్షునిగా ఆర్‌ఆర్‌ఎస్ వ్యక్తిని నియమించుకోవడం కాంగ్రెస్ దౌర్భగ్యం అని కెటిఆర్ విమర్శించారు. టిపిసిసి ప్రెసిడెంట్ ఆర్‌ఎస్‌ఎస్ మూలాలపై గతంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఆ పార్టీ నేత, పంజాబ్ మాజీ సిఎం అవరీందర్ సింగ్ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News