Saturday, December 21, 2024

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో సబ్‌స్టేషన్ల దగ్గర మొసళ్లతో నిరసనలు, పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యాయత్నాలు చేశారని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. కర్నాటక కాంగ్రెస్ నేత డికె శివకుమార్‌కు మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే అని కర్నాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. కర్నాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను చూడటానికి కర్నాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదని, కర్నాటకలో కాంగ్రెస్ చేతిలో దగపడ్డ రైతులు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారని కెటిఆర్ చురకలంటించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మీ గృహలక్ష్మీ హామీకి గ్రహణం పట్టించారని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు చేస్తామన్న మోడీ హామీలాగే కాంగ్రెస్ పార్టీ హామీ లు గంగలో కలిపిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు కర్నాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు కాంగ్రెస్ తెరలేపిందని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు లేరని, ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ- చైతన్యానికి అడ్డ అని విమర్శించారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నామని కెటిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News