Friday, December 20, 2024

రుణమాఫీ అయితే కాంగ్రెస్ కు ఓటు వేయండి… లేకపోతే మాకు వేయండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఉత్సహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో జరిగిన సభలో కెటిఆర్ మాట్లాడారు. మనది పదేళ్ల నిజం అని, కాంగ్రెస్‌ది వంద రోజుల అబద్ధమని మండిపడ్డారు. రైతులకు 24 గంటలు రైతులకు కరెంటు, చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చిన నాయకుడు కెసిఆర్ అని ప్రశసించారు. నల్లగొండలో ఫ్లోరైడ్‌ని పెంచిందే కాంగ్రెస్ అని, ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టింది కెసిఆర్ కాదా? అని ప్రజలను కెటిఆర్ అడిగారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టిందని, ఇవన్నీ ప్రజలకు చెప్పడంతో మన విఫలమయ్యామని, తప్పు ప్రజలది కాదని, మనదేనని, కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు విని ప్రజలు మోసపోయారన్నారు. ఇవాళ ప్రజలు, రైతులు బాధ పడుతుంటే చూడలేకపోతుున్నామన్నారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 1,60,283 ఉద్యోగాలు ఇచ్చామని కెటిఆర్ స్పష్టం చేశారు. ఆ విషయాన్ని విద్యార్థులు, నిరుద్యోగులకు చెప్పడంలో తాము విఫలమయ్యామన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసింది బిఆర్‌ఎస్సేనని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వంద రోజుల్లోనే మోసపోయామని ప్రజలు గ్రహించారని, రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదని కెటిఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ జరిగి ఉంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సూచించారు.

రుణమాఫీ రాక మోసపోయుంటే బిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని, నల్లగొండ, ఖమ్మం నేతలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారని ఎద్దేవా చేశారు. ఏక్‌నాథ్ శిండేలు కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు. నల్లగొండ జిల్లాలో ఆదివారం కెసిఆర్‌కు ప్రజలు అద్భుత స్వాగతం పలికారని, ఆ అభిమానం చూస్తుంటే ఆశ్చర్యం కలిగిందని, నల్లగొండ జిల్లాలో ఎలా ఓడిపోయామో అర్థం కాలేదని, డిసెంబర్ 3న భిన్నంగా ఫలితాలు వచ్చాయని, మొన్న జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకుందామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News