Wednesday, December 25, 2024

బ్రేక్ డ్యాన్స్ వార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలకు ఉచితబస్సుల ప్రయాణంపై కెటిఆర్, తనదైన శైలిలో వ్యంగస్త్రాలు సంధించారు. బస్సుల్లో అల్లం వెల్లు ల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై కెటిఆర్ విమర్శలు గుప్పించా రు.బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు తాము వద్దనట్లేదని పేర్కొన్నారు. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేకు డ్యాన్సులు వేసుకోవచ్చ ని తెలిపారు. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొ ట్టుకుంటున్నారని, డ్రైవర్లు కండక్టర్లకు కూడా ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బస్సులు ఎ క్కువ పెట్టండి, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బ స్సు పెట్టండంటూ ప్రభుత్వంనుద్దేశించి వ్యాఖ్యనించారు.ఆర్‌టిసి బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యా న్స్‌లు, రికార్డింగ్ డాన్స్‌లు చేసుకోవచ్చని కెటిఆర్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీ తండ్రి కెసిఆర్ మీకు నే ర్పిన గౌరవం, సంస్కారం

ఇదేనా కెటిఆర్..?…మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్‌లు చేస్తున్నారా..? అని అని ప్రశ్నించారు. ఆడవాళ్ళంటే కెటిఆర్ గౌరవం లేదని అన్నారు. మహిళల పట్ల కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని, భేషరతుగా కెటిఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనమని విమర్శించారు. గత పది సంవత్సరాలు హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అని కెటిఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నామని, అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. శ్రమ జీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి..? అని కెటిఆర్‌పై సీతక్క ప్రశ్నల వర్షం కురిపించారు.

కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్‌లు కేసులు నమోదు చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్‌టిసి మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని కెటిఆర్ తెలంగాణలోని మహిళా అక్క చెల్లెళ్లపై ఫేక్ వీడియోలతో ఉల్లి అల్లం ఆర్టీసి బస్సులో తీస్తున్నారు అని ప్రచారం చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇప్పుడు బ్రేక్‌డాన్స్‌లు చేసుకొమ్మని అవమానపరచిన కెటిఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్‌లు కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌టిసి బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అవమానపరిచే విధంగా మాట్లాడడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News