Monday, January 20, 2025

కెటిఆర్‌లాగే నాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి కెటిఆర్, ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కెటిఆర్ అడిగారు. తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఉండడంతో కెటిఆర్‌లాగే తనకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ వివరణ ఇచ్చారు. కుటుంబ పాలన కాదు అని… బాగా పని చేస్తే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయని కెటిఆర్ సలహా ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎంపిగా మీ కుమార్తె కీర్తి లేక కుమారుడు సంకీర్త్ పోటీ చేస్తారా? అని కెటిఆర్ ప్రశ్నించడంతో తన భార్య లక్ష్మీ పోటీ చేసుందని… దయచేసి తనను వివాదాల్లోకి లాగవద్దని సూచించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను కెసిఆర్ బిజెపిలోకి పంపుతారని రాజగోపాల్ చురకలంటించారు. తనకు హోమంత్రి పదవి కావాలని అడగడంతో పాటు బిఆర్‌ఎస్ వాళ్లను జైలుకు పంపుతానని ఆసక్తికరంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News