- Advertisement -
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ పై టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవ’సాయం’ అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు అని చురకలంటించారు. వ్యవసాయం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌజ్ లలో సేద తీరడం కాదని, సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదని రేవంత్ ధ్వజమెత్తారు. అది మట్టి మనసుల పరిమళమని, మట్టి మనుషుల ప్రేమ అని అన్నారు. ఎడ్లు – వడ్లు అని ప్రాసకోసం పాకులాడే ‘గాడిద’కేం తెలుసు గంధపు చెక్కల వాసన అని రేవంత్ ఎద్దేవా చేశారు.
- Advertisement -