Saturday, November 16, 2024

కెసిఆర్ ఉన్నంత కాలం అదానీ అడుగుపెట్టలేదు… ఇప్పుడొస్తున్నాడు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ గుల్ల అయ్యిందని గవర్నర్‌ తమిళిసైతో అబద్ధాలు చెప్పించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అందుకే రాష్ట్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో స్వేదపత్రం విడదల చేశామన్నారు. శుక్రవారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని, రుణాలు వసూలు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామన్నారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదని స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదాకా విడిచి పెట్టేదేలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్-బిజెపి నాయకుల అసలు రంగు బయటపడుతోందని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీని తిడితే సిఎం రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని ఆయన చురకలంటించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బిఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. మన బలం, మన గళం, గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉండాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News