Monday, December 23, 2024

ఆ ఫ్లెక్సీపై కెటిఆర్ మండిపాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఫెక్సీలోని ప్రభుత్వ చిహ్నం విషయంలో ఎక్స్‌లో కెటిఆర్ పోస్టు చేశారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేకుండా ప్రభుత్వం చిహ్నం ఉందని మండిపడ్డారు. అధికారిక నిర్ణయమా? లేక అనధికార నిర్లక్ష్యామా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఫ్లెక్సీ గురించి మీకైనా తెలుసా అంటూ సిఎస్‌కు ట్యాగ్ చేశారు. కొత్త చిహ్నాన్ని ఎప్పుడు, ఎవరు ఆమోదించారని కెటిఆర్ నిలదీశారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు వాడారని ప్రశ్నించారు. దీనికి కారకులెవరో తెలుసుకొని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News