Saturday, January 11, 2025

ఆడబిడ్డకు అన్ని తానై..

- Advertisement -
- Advertisement -

నిరుపేద విద్యార్థిని రచన
జీవితాన్ని నిలబెట్టిన కెటిఆర్
ఇంజినీరింగ్ చదువుకు మొత్తం
ఫీజులు కట్టిన మంత్రి
నాలుగు ప్రముఖ కంపెనీల్లో
ఉద్యోగం సంపాదించిన రచన
తల్లిదండ్రులు లేని తనకు అన్నగా
అండగా నిలబడ్డారు : రచన

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆడపిల్లల విద్య విషయం లో అండగా ఉండడంలో ఎప్పుడు ముందుండే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి మంచి మనసు తో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రు లు లేని రుద్ర రచన అనే ఇంజినీరింగ్ విద్యార్థిని చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం చేసి ఆమె ఇంజనీరింగ్ పూర్తి అయ్యేలా చూశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్‌ను పూర్తి చే శారు. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సిబిఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ సీటు సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన ఫీజులు చెల్లించలేకపోయింది. రుద్ర రచన ఆర్ధిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా 2019లో తెలుసుకున్న కెటిఆర్, ఆమెను ప్రగతి భవన్ పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజనీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను ఆయన వ్యక్తిగతంగా భరించారు. కెటిఆర్ ఆర్థిక సహాయం తో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్‌లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉ ద్యోగాన్ని సాధించింది.ఈ సందర్భంగా సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌ను రుద్ర రచన కలిసింది. ఆ మె చ దువు, ఉద్యోగాల విషయం తెలుసుకుని ఆయన ఎంతగానో సంతోషపడ్డారు. తనకంటూ ఎవరూ లేకున్నా ఆత్మ విశ్వాసంతో రుద్ర రచన జీవితంలో విజ యం సాధించిందని మె చ్చుకున్నారు. తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కెటిఆర్ ఒక అన్నగా అండగా నిలబడ్డారని, తన కల సాకారం కోసం తం డ్రిగా తపించారని రచన భా వోద్వేగానికి లోనయింది. ఈ సంవత్సరం రాఖీ కట్టాలనుకున్నానని అయితే కెటిఆర్ కాలికి గాయం అయిందన్న విషయం తెలుసుకుని బాధపడ్డానని రుద్ర రచన చెప్పింది. తాను పొదుపు చేసుకున్న డబ్బులతో వెండి రాఖీ తయారు చేయించానన్న రచన, దా నిని కెటిఆర్‌కు కట్టింది. రచన మాటలకు, అభిమానానికి ఆయన తీవ్ర భావోద్వేగానికి లో నయ్యారు.

రచన చేత రాఖీ కట్టించుకున్న తాను, ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. జీవితంలో అనేక కష్టా లు ఎదుర్కొని వాటిని సవాలుగా స్వీకరించి నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించి న ర చన యువతరానికి ము ఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. భవిష్యత్తు లో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్నా తన లక్ష్యానికి అం డగా ఉంటానని ఈ సందర్భంగా కెటిఆర్ హామీ ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజు, హాస్టల్ బకాయిలను కొరకు అవసరం అయినా మొత్తం నగదు సహాయాన్ని కూడా కెటిఆర్ అందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News