Wednesday, January 22, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు రుజువైతే కెటిఆర్ కు 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదు: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసు రుజువైతే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి. రామా రావుకు 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదని తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.  కొమటిరెడ్డి శుక్రవారం విలేకరులతో ముచ్చటిస్తూ ‘ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కెటిఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. ఇద్దరు ముగ్గురు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా సుమోటో కేసు దాఖలు చేయాలి. సినీ పరిశ్రమలో పనిచేసే వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వెల్లడయింది. కెసిఆర్ కోసం ఫోన్ ట్యాప్ చేసిన అధికారులు కాశీ రిజ్వీ కన్నా ప్రమాదకారులు’ అని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు, భుజంగ రావు వంటి పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని, దాని వల్ల అనేక కీలక వ్యక్తులు అరెస్టయ్యారని అన్నారు. బిఆర్ఎస్ పాలన కాలంలో తమ ఫోన్లు ట్యాంపింగ్ కు గురయ్యాయని కాంగ్రెస్, బిజెపి నాయకులు కూడా అంటున్నారు. నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్ మెషిన్ ను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నారని వినికిడి.

ఎస్ఐబి చీఫ్ టి. ప్రభాకర్ రావు, డిసిపి పి. రాధాకృష్ణ, తెలుగు టివి ఛానెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లపై లుక్ అవుట్ సర్య్యూలర్ జారీ అయింది. పరిశోధనకు వారు అందుబాటులో లేనందున  ఈ లుక్ అవుట్ సర్య్కూలర్ జారీ అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News