- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, గులాబి అధిపతి కెసిఆర్.. అన్ని జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వేడుకలపై నేతలతో చర్చించారు.
ఇక, గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శనివారం సమావేశం కానున్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్‌లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కెటిఆర్ కీలక సమావేశం కానున్నారు. పార్టీ రజతోత్సవ వేడుకలపై కీలక సూచనలు చేయనున్నారు. కాగా, ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ వేదికగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సభపై నేతలకు కెటిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -