- Advertisement -
హైదరాబాద్: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. సింగరేణికి బొగ్గు గనులు నేరుగా కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి తెలిపారు. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని చెప్పారు. ప్రభుత్వ సంస్థలను చంపేసే కుట్రను బిజెపి తెరలేపిందని ఫైర్ అయ్యారు. సింగరేణికి బలహీనపరిచి, నష్టాల సంస్థగా మార్చే కుట్ర జరుగుతుందని కెటిఆర్ అన్నారు. నష్టాలు చూపి చివరకు ప్రైవేటుపరం చేయాలని బిజెపి పన్నాగం చేస్తుందని మండిపడ్డాడు. సింగరేణి కోల్ మైన్ ఉద్యోగాల కల్పనలో గోల్డ్ మైన్ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గనులు మూతపడే కొద్దీ ఉగ్యోగాలు పోతాయని వివరించారు. సింగరేణి పరిరక్షణ కోసం కార్మికులకు అండగా ఉంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.
- Advertisement -