- Advertisement -
కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలనే విపక్ష ఎంఎల్‌ఎల హక్కులకు భంగం కలిగిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆక్షేపించారు. ప్రొటోకాల్ ఉ ల్లంఘటనలకు సంబంధించి ఆయన సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు. ప్రతి సందర్భంలో ప్రొటోకాల్ ఉ ల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించా రు. హక్కుల రక్షణ విషయంలో సభాపతి అధికారాలను వినియోగించి చర్య లు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యం త్రాంగం సలాం కొట్టడమేంటని మాజీ మం త్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా నిలదీశారు.
- Advertisement -